భద్రాచల దేవస్థాన పిలుపు మేరకు కోటి తలంబ్రాల దీక్షను చేపట్టిన శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో శుక్రవారంనాడు 1వ వార్డులో ప్రాథమిక పాఠశాల ఆవణంలో కౌన్సిలర్ బొగ్గులచందు నిర్వహణలో మహిళలు పెద్ద ఎత్తుల పాల్గొని భక్తి శ్రద్ధలతో రామనామాన్ని స్మరిస్తూ ఓడ్లను ఓలిచి తమ తమ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి పాల్గొని మాట్లాడుతూ కోటి తలంబ్రాలను దీక్ష అద్భుతమైన కార్యక్రమం అందులో మనమందరం పాల్గొనే విదంగా కృషి చేస్తున్న రామకోటి రామరాజు ధన్యుడన్నాడు. మన గజ్వేల్ నుండి భద్రాచల సీతారాముల కళ్యానానికి ఈ తలంబ్రాలను తీసుకెళ్లడం దీనికి శ్రీరామకోటి భక్త సమాజం శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. సామాజిక సమరసత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల నరేష్ బాబు మాట్లాడుతూ తలంబ్రాలు దీక్ష అనేది మనకు లభించడం మన భక్త శ్రద్దలకు నిదర్శననన్నారు. ఇలాంటి అవకాశాన్ని కల్పించిన రామకోటి రామరాజుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్మాస్టార్ లక్ష్మీప్రసన్న, మరియు ప్రసాద్, ఉపాధ్యాయులు ప్రతిభ, శారదా, పాపారావు, నీరుడు స్వామి, నాయకులు ఉప్పల్ మధు, రాచకొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.




