జగదేవపూర్ : తెలంగాణ ఉద్యమంలో తన పాటా మాటతో లక్షలాది మందిని చైతన్యపరిచి ఉద్యమ భావజాల వ్యాప్తికి విశేషంగా కృషి చేసిన కవి, గాయకుడు సిద్దిపేట మట్టి బిడ్డ దేశపతి శ్రీనివాస్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందని ధర్మారం సర్పంచ్ పిట్టల రాజు ముదిరాజ్ అన్నారు. గురువారం మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కోట కింద ముగ్గురికి అవకాశం రావడంతో పాటు అందులో సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన కవి దేశపతి శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ ను నమ్మి పనిచేసిన ఉద్యమకారులకు తప్పకుండా న్యాయం చేస్తారని అనడానికి దేశపతి శ్రీనివాస్ నియామకమే నిదర్శనమన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా సీఎం కేసిఆర్ కు ఓఎస్దిగా పనిచేస్తూ అనేక ప్రభుత్వ కార్యక్రమాల రూపకల్పన, ప్రచారంలో దేశపతి శ్రీనివాస్ తనదైన ముద్రను వేశారన్నారు.
