జగదేవపూర్ మండల కేంద్రంలో
గురువారం అంగన్వాడీ సూపర్ వైజర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ బాలేశం గౌడ్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, మహిళ లేకపోతే సృష్టి లేదని, అలాంటి మహిళలను మనం గౌరవించాలని అన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్ తో పాటు సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ కవిత మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు.