ప్రాంతీయం

రంజాన్ నరేష్ యూత్ అధ్యక్షునిగా ఏకగ్రీవం…

136 Views
     ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 17, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షునిగా రంజాన్ నరేష్ ఎన్నిక యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనాథ్, సిరిసిల్ల నియోజకవర్గ అధ్యక్షులు చుక్కశేఖర్ ముస్తాబాద్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా రంజాన్ నరేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రంజాన్ నరేష్ మాట్లాడుతూ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు జిల్లా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులకు మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ కి జిల్లాఅధ్యక్షులు ఆదిశీనన్నకి సిరిసిల్ల నియోజకవర్గ బాధ్యులు కేకే మహేందర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు ముస్తాబాద్ మండలంలో యూత్ కాంగ్రెస్ ను బలోపేతం చేస్తానని అన్నారు. యువతకు అందుబాటులో ఉంటూ యువకుల యొక్క సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. త్వరలోనే మండలంలోని అన్ని గ్రామాలలో యూత్ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేసి రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లకు సన్నద్ధమయ్యేలా యూత్ ను ముందుకు నడిపిస్తాను అన్నారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *