ప్రాంతీయం

కళ్యాణలక్ష్మి చెక్కులు అందించిన ఎంపీపీ, ప్రజాప్రతినిధులు…

313 Views

 

ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే10, కల్యాణలక్ష్మి, పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాలలో బుధవారం లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. ఈసందర్బంగా ఎంపీపీ జనగామ శరత్ రావు మాట్లాడుతూ అన్నివర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆడపిల్లల పెళ్లి చేయాలంటే పేదవాళ్లు అప్పుచేసి పెళ్లి చేసేవారని బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు మేనమామగా మారి ఒక్కలక్ష 116 రూపాయలను పేద ప్రజలకు చెక్కుల రూపంలో నేరుగా ఇస్తున్నారన్నారు. కెసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజలు వినియోగించుకొని ఆర్థికంగా లబ్దిపొందాలన్నారు. పేదింటి యువతుల వివాహానికి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఎంతో లబ్ధిచేకూరుస్తున్నాయన్నారు. కళ్యాణ లక్ష్మితో పాటు స్వయంగా ఎంపీపీ చీరను గాజులు కూడా అందించారు. ఈకార్యక్రమంలో జెడ్పిటిసి గుండం నరసయ్య, బొంపల్లి సురేందర్ రావు, మాజీ ఉపసర్పంచ్ కొండ శ్రీనివాస్ గౌడ్, అన్వర్, తాళ్లరాజు, దబ్బెటరాజు, మహిళా నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *