ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వచ్ఛతీ సేవాకార్యక్రమం
( మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి)
స్వచ్ఛతీ సేవాకార్యక్రమంద్వారా ఆరోగ్య భారత్ ఏర్పడుతుందనీ, విద్యార్థులలో, వాలంటీర్లలో ప్రతిఒకరికి దేశభక్తి,ఐక్యతాభావం,శ్రమదానం, సేవాభావం, శ్రమజీవనం, అలవడుతాయనీ దేశాభివృద్ధికి తోడ్పడుతుందనీ జాతీయ సేవాపథకం ప్రోగ్రాం అధికారి వాసరవేణి పర్శరాములు అన్నారు.
తేదీ 02- 10-2023రోజున యెల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవాపథకం (ఎన్.ఎస్.ఎస్) ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛతీసేవాకార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఆవరణలో గడ్డి చెక్కడంతోపాటు, చీపుర్లతో ఊడ్చి శుభ్రం చేశారు. మహాత్మాగాంధీ, లాల్ బహదూర్శాస్త్రి ఫోటోలకు పూలాలంకరణచేసి అంజలిఘటించారు. ఈసందర్భంగా జాతీయ సేవాపథకం ప్రోగ్రామ్ ఆఫీసర్ వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో పచ్చదనం- పరశుభ్రత కార్యక్రమాలు నిర్వహించామనీ ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లద్వారా కళాశాల గదులకు ప్రమాదకరమైన కొమ్మలను తొలిగించడంతోపాటు గడ్డి చెక్కామనీ అన్నారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సి.హెచ్ మోహన్ గారిచే హరితహారంలో భాగంగా మొక్కలు నాటించామనీ, ఉపన్యాసకులు, వాలంటీర్లు భాగస్వాములయ్యారన్నారు.
గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాతీయ సేవాపథకం ప్రోగ్రాం అధికారి వాసరవేణి పర్శరాములు, ఎండి తాజోద్దిన్, లక్ష్మీ, వాలంటీర్లు పిట్ల సందీప్, గోషికె విజయ్, వరికుప్పల అయోధ్య, పాక ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.




