రాయపోల్ మండల పరిధిలోని బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నేషనల్ సైన్స్ డే ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సైన్స్ ఫెయిర్, సైన్స్ రంగవల్లి, సైన్స్ వ్యాసరచన, సైన్స్ డ్రాయింగ్, స్పీచ్ మొదలైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నజియా తబస్సుమ్, ఉపాధ్యాయుల బృందం అభినందించడం జరిగింది. అదేవిధంగా సైన్స్ డే విజయవంతం కావడానికి మూడు రోజులు కష్టపడినటువంటి సైన్సు ఉపాధ్యాయులను ప్రధానోపాధ్యాయురాలు అభినందించడం జరిగింది.
