సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో మంగళ వారం రేణుక ఎల్లమ్మ దేవాలయంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు సమర్పించి,రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని గజ్వేల్ ఆర్యవైశ్య సంఘం నాయకులు ప్రముఖ వ్యాపారవేత్త బుక్క రమేష్ విరిజ కుటుంబ సభ్యుల సౌజన్యంతో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, పాలకవర్గం, ఎంపీటీసీ మరియు గౌడ సంఘం నాయకులు తాళ్ల ఆంజనేయులు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రవి గౌడ్, భూమా గౌడ్, హరికిషన్ గౌడ్, నరసింహ గౌడ్, నరేష్ గౌడ్, సింహం గౌడరాజలింగం గౌడ్, నర్సింలు గౌడ్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
