రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో శ్రావణ శుక్రవారం సందర్భం పురస్కరించుకుని గంభీరావుపేట ఉమ్మడి మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో నాయకమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని నాయకమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ , గంభీరావుపేట జెడ్ పి పి టి సి కొమిరి శెట్టి విజయ లక్ష్మణ్ మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కూర సురేష్ భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయినగోపి మాజీ సెస్ డైరెక్టర్ దేవేందర్ యాదవ్ భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు గంట అశోక్, కుల పెద్దలు మేకార్తి మల్లేశం, చిట్టంపల్లి నాంపల్లి పాల్గొనడం జరిగింది. మండల అధ్యక్షులు మరియు కూర సురేష్ మాట్లాడుతూ ఉమ్మడి మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టినటువంటి సంఘ భవన నిర్మాణాన్ని ఎన్ని అవాంతరాలు ఎదురైనా అమ్మవారి యొక్క వార్షికోత్సవం వరకు పూర్తి నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమిస్తామని తెలిపారు. ఆలయం పునర్నిర్మాణం కోసం కూడా శ్రాయ శక్తుల కృషి చేస్తామని ఇట్టి నిర్మాణానికి సంఘ సభ్యులు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండి సహకరించగలరని కోరుకోవడం జరిగింది. మూడు సంవత్సరాల నుండి నాయకమ్మ దేవాలయానికి వచ్చి భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తున్నట్లు గంభీరావుపేట జడ్పిటిసి కొమిరిశెట్టి విజయలక్ష్మి అన్నారు.
