కోనరావుపేట/రిపోర్టర్ డి. కరుణాకర్/
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ గ్రామంలో అంగరంగ వైభవంగా శివరాత్రి ఉత్సవాలను నిర్వహించారు.శివమాలదారులు శివణామస్మరణలో ఆలయ ప్రాంగణం హోరేత్తగా సర్పంచ్ దంపతులు కేతిరెడ్డి అరుణ జగన్మోహన్ రెడ్డి, స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండం దేవేందర్ రెడ్డి, తాళ్లపెల్లి తిరుపతి, ముష్కం సత్తయ్య దంపతులు శివ కళ్యాణం జరిపించారు. తాళ్లపెల్లి తిరుపతి దంపతులు అన్నదానం చేశారు. యూత్ సభ్యులు, మహిళలు అన్నదానా కార్యక్రమ నిర్వహణ చేసారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వంగపెల్లి సుమలత శ్రీనివాస్, ఆలయ కమిటి సభ్యులు, పాలక వర్గం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
