గజ్వేల్ లో భాగ్యరెడ్డి వర్మ 84వ వర్ధంతి సందర్భంగా దళిత వైతాళికుడుగా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ (మే 22, 1888 – ఫిబ్రవరి 18, 1939) సంఘ సంస్కర్త, ఆది ఆంధ్ర సభ స్థాపకుడు. 1906-1933 మధ్య హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశాడు. జగన్మిత్రమండలి, మన్యసంఘం, సంఘసంస్కార నాటకమండలి, అహింసా సమాజంలను స్థాపించి హైదరాబాదు ప్రాంతంలో సంఘసంస్కరణలకై ఎన్నో కృషిచేశాడు. దళితులు ఈ దేశ మూలవాసులని దళితులు ఈ దేశ పాలకులని వారిది గొప్ప చారిత్రక నేపథ్యం ఉందని నమ్మే భాగ్యరెడ్డి వర్మ తాను బాగయ్య నుండి భాగ్యరెడ్డి వర్మ పేరుగాంచుకొని వైపు దళితులను అంతర్గత సంస్కరణలు చేస్తూనే మరోవైపు వారికి చట్టసభలలో ప్రాతినిధ్యం హక్కుల కోసం జాతీయ స్థాయిలో పనిచేశాడు. ఆది హిందువు మహాసభలో క్రియాశీలక నాయకుడిగా మారి 1920 నుంచి 1931 వరకు ఢిల్లీ అలహాబాద్ నాగపూర్ లక్నోలో జరిగిన జాతీయ సదస్సులకు దక్షిణ భారతదేశం నుంచి ప్రతినిదిగా భాగ్యరెడ్డి వర్మ పాల్గొని సభలో ప్రసంగించారు. ఇట్టి కార్యక్రమంలో
మాల మహానాడు జాతీయ నాయకులు తుమ్మ శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ టీ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నాల కుమార్, మాదిగ తెలంగాణ అంబేద్కర్ సంగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ చిప్పల యాదగిరి, మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి, వర్గల్ మండల అధ్యక్షుడు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.