కోనరావుపేట/ రిపోర్టర్ డి.కరుణాకర్/రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటమండలంలోని నిజామాబాద్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో చదువుకున్న పూర్వ విద్యార్ధి కేతిరెడ్డి గంగా రెడ్డి, పదవ తరగతి విద్యార్థులకు తన సొంత ఖర్చులతో 5000/- రూపాయల విలువగల స్టడీ మెటీరియల్ విద్యార్థిని విద్యార్థులకు వారి మిత్రులతో కలిసి అందజేశారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వంగపల్లి శ్రీనివాస్, గూండా తిరుపతి, ప్రధానోపాధ్యాయురాలు శారద, ఉపాద్యాయులు యూసుఫ్ఉద్దీన్, కవిత, గోనె బాలరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
