విద్య

బదిలీలను ప్రారంభించాలి

142 Views

 

టీఎస్ టీడబ్ల్యూటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జబ్బ రవి

 

తెలంగాణ క్రాంతి,ఏటూరు నాగారం,సెప్టెంబర్ 19

 

గిరిజన సంక్షేమ విద్యా శాఖలో పని చేస్తున్న ఉపాధ్యాయలకు వెంటనే బదిలీలు నిర్వ హించాలని టీఎస్ టీడబ్ల్యూటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జబ్బ రవి పేర్కొన్నారు. మంగళవారం ఏటూరునాగారం ఐటీడిఏ ప్రాంగణంలో టీఎస్ టీడబ్ల్యూటీయూ అత్యవసర సమావేశం మండల అధ్యక్షులు అన్న వరం వెంకటేశ్వర్లు ఆధ్వ ర్యంలో నిర్వహించారు.ఈ సమావేశంకు ముఖ్య అతిధిగా టీఎస్ టీడబ్ల్యూటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జబ్బ రవి హాజరై మాట్లాడుతు సి టీ డబ్ల్యూ సర్కిలర్ జారీ చేస్తూ బదిలీల ప్రక్రియను వెంటనే నిర్వహించేలా చూడాలని అన్నారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లో బదిలీల ప్రక్రియ ప్రారంభమై నేటికి ట్రాస్ఫర్ పూర్తయి పాత నూతనంగా జాయిన్ అవడం జరిగింది కాని నేటికీ గిరిజన సంక్షేమ శాఖలో దానిపై ఎటువంటి కదలికలు లేవని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ వెంటనే స్పందించి బదిలీల ప్రక్రియ ప్రారంభించి అక్టోబర్ 3 వరకు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్ సమ్మయ్య, ప్రకాష్ రావు,బాబు రావు, సమ్మయ్య,శ్రీనివాస్ రావు, బుచ్చయ్య,బానోత్ శ్రీనివాస్, పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *