బిఆర్ఎస్ పరిపాలనలో అధికార వ్యవస్థ కు విలువలు లేవని కరీంనగర్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు, కొండపల్కల ఎంపీటీసి గుర్రాల వెంకట్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర ఆరోపించారు. బిజెపి రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ప్రజా గోస-బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని ప్రతీ పార్టీ శక్తి కేంద్రాల వేదికగా స్ట్రీట్ కార్నర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాగా శుక్రవారం మండలంలోని వచ్చునూర్, గొల్లపల్లి గ్రామాల్లోని శక్తికేంద్రాల్లో వేర్వేరుగా జరిగిన కార్నర్ మీటింగ్ లకు ముఖ్య అతిధులుగా హాజరైన వారు మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించే అధికారాలు కూడా సంబందింత అధికారులకు లేకుండా చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని ఎద్దేవా చేసారు.సాంకేతిక పరమైన ఏ చిన్న సమస్య ఎదురైనా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.రెవెన్యూ పరమైన సమస్యలు వచ్చినప్పుడు తహసీల్దార్ దగ్గరికి వెళ్తే ఆర్డివో దగ్గరికి వెళ్లాలని ఆయన దగ్గరికి వెళ్తే కలెక్టర్ దగ్గరికి వెళ్లాలని ఇలా అటూ, ఇటూ తిప్పుతూ బాధిత ప్రజలకు నరకం చూపిస్తున్నారని అన్నారు.అనవసరమైన పథకాలు పెట్టి ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.ప్రభుత్వ పనుల్లో పారదర్శకత లోపించి, అవినీతి మాత్రమే కనిపిస్తుందని అన్నారు.ప్రజలందరి సంక్షేమం అభివృద్ధి కోసం ఆలోచన చేసే విధానం బీజేపీ కే ఉందని అన్నారు.
రాష్ట్రంలో ప్రజల జీవితాలతో కెసిఆర్ ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆరోపించారు.దేశ ప్రజల సంక్షేమం తో పాటుగా, దేశ సమగ్రత విషయంలో అనునిత్యం ఆలోచన చేసే మోడీ ని విమర్శించే పార్టీ లు త్వరలో కనుమరుగు అవుతాయని అన్నారు.అందుకే బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేలా ప్రజలను చైతన్యం చేయాల్సిన భాద్యత కార్యకర్తలదేనని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను, రాష్ట్ర ప్రభుత్వ వైపల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.ప్రజలఆరోగ్య భద్రత కోసం ఐదు లక్షల రూపాయల ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకువచ్చిందన్నారు.ముదిరాజ్ కులస్తులకు ఐదు లక్షల ఉచిత భీమా సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్నదని తెలిపారు.రాష్ట్ర పరిస్థితి ఐదు లక్షల కోట్ల అప్పుల్లో ఉందని ఆరోపించారు.రైతులకు ఉచిత ఎరువులు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3016, వృద్ధాప్య పింఛన్లు, రేషన్ కార్డులు, ఒంటరి మహిళలకు పింఛన్లు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విధాలుగా సామాన్య ప్రజానీకాన్ని కెసిఆర్ సర్కార్ మోసం చేసిందన్నారు.ఎక్కడ లేని విధంగా కరెంట్, ఆర్టీసీ చార్జీలను పెంచుతున్నారని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు చేరే విధంగా పని చేయాలని,బూత్ మరియు శక్తి కేంద్రాల వారిగా బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం ఇటీవల రోడ్ ప్రమాదం నకు గురైన దళిత మోర్చా నాయకులు ఉప్పులేటి బాబు ను నాయకులు పరామర్శించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి,శక్తి కేంద్ర ఇంచార్జి బూట్ల శ్రీనివాస్,జిల్లా కార్యవర్గ సభ్యులు దూలం కిరణ్,ప్రధాన కార్యదర్శి గొట్టిముక్కల తిరుపతి రెడ్డి,మండల ఉపాధ్యక్షులు తమ్మనవేణి రాజు యాదవ్,ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి ఎర్రోజు లక్ష్మణ్,సీనియర్ నాయకులు లక్ష్మణాచారి,దళితమోర్చా ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి జీవన్,బూత్ అధ్యక్షులు నిమ్మనగొట్టు శంకర్,బండి స్వామి,బల్ల హరీష్ తదితరులు పాల్గొన్నారు.




