కోనరావుపేట:రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో ని మర్తన్ పేట, గ్రామంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించిన హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల డిసిసి జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిధిగా పాల్గొని ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భావిభారత ప్రధాని రాహుల్ గాంధీ దేశంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను, ముక్యంగా ప్రజలందరినీ మతపరంగా, భాష పరంగా విడదీసి రాజకీయం చేస్తున్న ప్రత్యర్థులకు దీటుగా దేశాన్ని ఏకం చేయాలన్న ఆలోచనతో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలోని అంశాలను, తాను ప్రజలతో పంచుకున్న భావాలు, ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను వాటితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోపుతున్న భారలను ప్రతి ఇంటికి చేరాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అదేశాల మేరకు ఇంటింటికి కరపత్రాల మంచి వివరించడం జరుగుతుందన్నారు . పెట్రోల్, డీజల్ పెంపు, సిలెండర్ ధరలు, నిత్యావసరాలు ఆకాశాన్ని అంటాయని దీని ద్వారా సామాన్యులు ఎదుర్కుంటున్న బాధలు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్కువ కాదన్నట్టు కరెంట్, బస్ ఛార్జీలతో ప్రజలపై అదనపు భారాన్ని మోపుతున్న విషయాని అంతే కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇండ్లు, దళితులకు భూమి, ఇలా ఎన్నికల హామీల్లో ఎన్నో చెప్పి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, తాళ్ల పెళ్లి ప్రభాకర్, బోయిని దేవరాజు, శ్రీనివాస్, ధర్మేందర్, భాస్కర్ రావు, రవి గౌడ్, రామచంద్రం గౌడ్, మేకల స్వామి, గొట్టిపర్తి అజయ్, మధు, పాకాల వినయ్ గౌడ్, పుట్టపర్తి రాకేష్, గ్రామస్థులు,తదితరులు పాల్గొన్నారు.
