ప్రాంతీయం

తాసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం…

108 Views

ముస్తాబాద్, ఏప్రిల్ 1 (24/7న్యూస్ ప్రతినిధి)  ప్రభుత్వం రైతులపై చిన్నచూపు బీజేపీ ముస్తాబాద్ మండల అధ్యక్షులు మేరుగు అంజాగౌడ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందచేసారు. ఇటీవల కురిసిన వడగండ్ల వానకు నష్టపోయిన రైతులకు ఎకరాకు రు 20వేల రూపాయల చొప్పున తక్షణమే ఇవ్వాలి. వంద రోజులలోపు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని ఇప్పటివరకు చేయలేదు వెంటనే దీన్ని అమలుపరచాలి. రైతు భరోసాకింద ఒకఎకరాకు 15వేలు ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు దీనిని వెంటనే అమలుపరచాలి. 5వందలు రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పి ఇప్పటివరకు దాన్ని అమలుపరచలేదు. ఐకెపి సెంటర్లను ఏర్పాటు చేసి తరుగు తీయకుండా కొనుగోలు చేసే ఏర్పాటు చేయాలి. పసలు బీమాను అమలు అయ్యేటట్టు  చేయాలి. ఎండిపోతున్న పంటలకు సాగునీరు అందేలా ఏర్పాట్లు చేయాలి. రైతులకు సబ్సిడీపై విత్తనాలను అందేటట్టు ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. వడగండ్ల వానకు నష్టపోయిన మామిడి రైతులకు ఎకరాకు లక్షరూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని పట్టణ అధ్యక్షులు మెంగని మహేందర్, సంతోష్ రెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షులు వరి వెంకటేష్, బిజెపి సీనియర్ నాయకులు కరీడ్ల రమేష్ రెడ్డి, శ్రీనివాసరావు, సౌల్ల  క్రాంతి, కోల కృష్ణ గౌడ్, ఏళ్ళ గిరిధర్ రెడ్డి, ఏదునూరి గోపి, వొరగంటి సత్యంచారి, చీకోటి మహేష్ భారతీయ జనతా పార్టీ నాయకులు తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు.

No Slide Found In Slider.

Poll not found