మనిషిని మనిషిగా చూడ నిరాకరించి అసమానత్వాన్ని, బానిసత్వాన్ని అమలుచేసిన మనుస్మృతిని ప్రాచీన రాజ్యాంగంగా ప్రచారం చేయడం సిగ్గుచేటని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ అన్నారు. మనుస్మృతికి ప్రాచీన రాజ్యాంగం శిక్షాస్మృతి అని పుస్తకాన్ని ప్రచురించి తెలుగు విశ్వ విద్యాలయంలో ఆవిష్కరణ చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను మానుకొవాలని అదివారం నాడు హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రములోని అంబేద్కర్ విగ్రహం ముందు మరొసారి మనుస్మృతిని డిబిఎఫ్ అధ్వర్యంలో దగ్దం చేసారు. ఈ సందర్భంగా డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ అరాచకానికికి మారుపెరైన మనుస్మృతి పుస్తక అవిష్కరణకు వెళ్ళుతున్న విశ్రాంత ఐఏఎస్ రమణచారిని ప్రభుత్వ సలహదారుడి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం ఐఏఏస్ అయి ప్రభుత్వ పదవిలో కొనసాగడం తగదన్నారు. దళిత బహుజనులకు, మాహిళలు విద్య, ఉద్యోగాలు చెయరాదని, సంపదను నిరాకరించిన మనుస్మృతిని 1927 లో అంబేద్కర్ తన బ్రహ్మణ స్నేహితులతో దగ్దం చేశారన్నారు. మనుస్మృతిని అధికారికంగా రద్దు చేసి సమానత్వానికి ప్రతిక అయిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందన్నారు. రాజ్యాంగం అమలు తర్వాత ఎస్సీ ఎస్టీ, బిసి,మైనారిటీ, మహిళలకు చదువుకునే హక్కు వచ్చిందన్నారు. భారత రాజ్యాంగం స్ధానంలో మనుస్మృతిని తిరిగి అమలు చేసేందుకు జరుగుతున్న కుట్రలను ప్రతిఘటించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రౌతు రమేష్, డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చుంచు రాజేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సిలువేరు బిక్షపతి, జిల్లా అధ్యక్షుడు మదాసి సురేష్, నాయకులు అనిత, శ్రీనివాస్, వనశ్రీ, రవిందర్, చుంచు నరేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
