దౌల్తాబాద్: మండల పరిధిలోని చెట్ల నర్సంపల్లి గ్రామంలో వేమ నాగరాజు ఇటీవల ఆత్మహత్య చేసుకోగా కుటుంబాన్ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే ప్రమాదవశాత్తు గాయపడిన వేమ కనకరాజును పరామర్శించి మెరుగైన వైద్యం చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వేమ జనార్ధన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి నాయకులు సుధాకర్, ప్రవీణ్, స్వామి, నాగరాజు, రమేష్, మహేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు…
