Breaking News

అఖిల భారత జర్నలిస్టు ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా కార్యవర్గం నియామకం

174 Views

 

సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆదివారం అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు విజయ్ గణేష్ ఆధ్వర్యంలో అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా యూనియన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.. నూతన కమిటీ నియామకం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబిజేఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజ లింగం హాజరయ్యారు.జిల్లా అధ్యక్షుడు విజయ్ మాట్లాడుతూ.సిద్దిపేట లో జరిగినటువంటి ఏబిజేఎఫ్ యూనియన్ లో ప్రతి ఒక్కరూ బాధ్యతతో తమ పదవులకు న్యాయం చేయాలన్నారు.ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా జర్నలిస్టులు ఉంటారని జర్నలిస్టుల బాధ్యత సక్రమంగా నిర్వహించాలని జర్నలిస్టులకు అండగా ఏబిజేఎఫ్ ఎల్లప్పుడూ పనిచేస్తుందని అన్నారు.రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రాజలింగం మాట్లాడుతూ…సిద్దిపేట జిల్లా నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.జిల్లాలో మీకు ఇచ్చిన బాధ్యతను సహా శక్తుల కృషి చేయాలని అన్నారు..నూతన కార్యవర్గం సిద్దిపేట జిల్లా ఏబిజేఎఫ్ ప్రధాన కార్యదర్శిగా పోతరాజు రమేష్, ఉపాధ్యక్షులుగా జనగామ సతీష్, వెంకట నరసింహ రెడ్డి, సహాయ కార్యదర్శి ప్రభాకర్, కార్యదర్శి గుడాల శేఖర్ గుప్త, కోశాధికారి వేముల కుమార్ ప్రచార కార్యదర్శులు నరిశెట్టి మల్లేశం, చింత కింది కరుణాకర్, సంయుక్త కార్యదర్శులు ఇప్ప నర్సింలు, ఖమ్మంపల్లి జీవన్, సంపత్, అల్వాల రాజు, తాడురి స్వామి నియామకం జరిగింది ఈ కార్యక్రమంలో ఏబిజేఎఫ్ సభ్యులు పోయిల ఆంజనేయులు, వెంకటేష్, నర్సింలు, రమేష్ పండుగ శ్రీనివాస్ రెడ్డి, రుద్ర రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు…

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *