కోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నిమ్మపల్లి, గ్రామంలో తెగులు సోకిన వరి పంటలను మండల వ్యవసాయ అధికారి వెంకట్రావమ్మ, ఏఈవో సహజ, పరిశీలించారు. వరిపైరులో వచ్చే వివిధ తెగుళ్ల పట్ల రైతులు సరైన సమయాలలో మందులను వాడాలని సూచించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యంగా వరి పైరులు వచ్చే మోగి పురుగు నివారణలో భాగంగా
ఎకరా విస్తీర్ణం పొలానికి 10 కిలోల కార్పోప్యూ రాన్ 3జి గుళికలు గానీ, 8 కిలోల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 48 గుళికలు గానీ, 4 కిలోల క్లోరాంట్రానిలిప్రోల్ 0.4జి గుళికలు గానీ చల్లాలిని లార్వా దశలో వరిపైరును నష్టపరు వస్తున్న ప్రాంతాల్లో 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ గానీ, 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్ గానీ, 2 గ్రాముల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50ఎస్ పీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని ఆకు ముడుచు పురుగు నివారణకు క్లోరిపైరిఫాస్ 2 మిల్లీలీటర్లు గానీ, రెండు గ్రాముల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ ఎస్.పి. పొడిని లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. కమతాలను ఆరబెడుతూ నీటిని అందిం చడం వల్ల సల్ఫర్ డయాక్సైడ్ గాలిలో చేరిపోయి సల్ఫైడ్ ఇంజూరీ తగ్గిపోతుందని అన్నారు. ఇక్కడ సర్పంచ్ కదిరే శ్రీనివాస్, రైతులు తదితరులు ఉన్నారు.
