‘‘పెద్దన్న’ సినిమాని మేము ఎందుకు తీసుకున్నామా? అని అందరికీ అనుమానం రావొచ్చు. కరోనా తర్వాత ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్లకి వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ పెద్ద సినిమాను తీసుకొస్తే ఇంకా బాగుంటుందనే నమ్మకంతో విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత డి. సురేశ్ బాబు అన్నారు. రజనీకాంత్, నయనతార జంటగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘అన్నాత్తే’.
