దౌల్తాబాద్: రైతు సంక్షేమం సీఎం కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూడవెల్లి వాగు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పంటలు సాగు చేశారని, వాగులో నీటి మట్టం తగ్గిపోవడంతో పంటలు ఎండిపోయే అవకాశాలు ఉన్నాయన్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్, మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు ఆదేశాల మేరకు ఈనెల 03న ఉదయం 8; 30 నిమిషాలకు కొడకండ్ల వద్ద కూడవెల్లి వాగులోకి మల్లన్న సాగర్ జలాలను విడుదల చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాకముందు వర్షాకాలంలో కూడా కూడవెల్లి వాగు ఎండిపోయిన సందర్భాలు ఉన్నాయని, పంటలు సాగు చేసిన రైతులు పంట పొలాలు ఎండిపోవడంతో నానా కష్టాలు పడ్డారని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ అపర భగీరధులుగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం జరుగుతుందన్నారు..కాలువలు పూర్తి అయితే చెరువు, కుంటాల్లోకి కూడా నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు..కూడవల్లి వాగులోకి గండు కరువులో నీళ్లు చూస్తామని ఎప్పుడైనా.. ఊహించుకోలేదని, నేడు సీఎం కేసీఆర్ ఆ ఊహను నిజం చేశాడన్నారు ..దుబ్బాక నియోజకవర్గం రైతుల పక్షాన సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.. కొడకండ్ల వద్ద జరిగే కార్యక్రమానికి దుబ్బాక, గజ్వెల్ నియోజకవర్గం లోని, ముఖ్యంగా గజ్వెల్, దుబ్బాక,తొగుట, మిరుదొడ్డి మండలాల ప్రజా ప్రతినిధులు నామినేటెడ్ ప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
