రాష్ట్ర వ్యాప్తంగా జరిగే లోకసభ ఎన్నికలలో తెలంగాణ ప్రజలందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో స్వచ్ఛందంగా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోమవారం జరిగే లోకసభ ఎన్నికలలో వయోజనులందరూ ఏ ప్రాంతంలో ఉన్న ఎక్కడ ఉన్న తమ స్వగ్రామానికి చేరుకొని ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు వజ్రాయుధమని అలాంటి ఓటు హక్కును భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎన్నో పోరాటాలు చేసి భారత దేశంలో ఉన్న ప్రజలకు కులమతాలు, ధనిక పేద, స్త్రీ పురుషులు అని తేడా లేకుండా 18 సంవత్సరాలు నిండిన వయోజనులందరికీ ఓటు హక్కును కల్పించారు. ప్రతి ఒక్కరికి ఒకే ఓటు ఒకే విలువ ఉంటుందన్నారు. అలాంటి ఓటు హక్కును దుర్వినియోగం చేసుకోకుండా మద్యం, డబ్బులు, చీరలు వంటి తాయలాలతో ఓటర్లను ప్రభావితం చేయడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తుంటారని, అలాంటి ప్రలోభాలకు తలోగ్గి ఓటును అమ్ముకుంటే ఐదు సంవత్సరాలపాటు మన భవిష్యత్తును అమ్ముకున్నట్లేనని అన్నారు.ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరికీ స్వేచ్ఛ, సౌబ్రాతత్వం, సార్వభౌమాధికారం లాంటి హక్కులను రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డాయని,వారికి నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే స్వేచ్ఛ కల్పించబడింది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్నారు.
