ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాలో 49 పదవ తరగతి పరీక్ష కేంద్రాల ఏర్పాటు

37 Views

మంచిర్యాల జిల్లా.

49 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిన జిల్లా అధికారులు. సూచనలు చేసిన జిల్లా కలెక్టర్.

మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించబడతాయి.

మంచిర్యాల జిల్లాలో పదవ తరగతికి సంబంధించి 49 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి, పగడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను సూచించారు. మార్చ్ 21 నుండి ఏప్రిల్ 04 తారీఖు వరకు పదో తరగతి పరీక్షలు కు సంబంధించి ఏర్పాట్లు చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. 9189 మంది పదవ తరగతి రెగ్యులర్ విద్యార్థులు మరియు 221 మంది సప్లమెంటరీ పరీక్షలు రాయనున్నారు అని వెల్లడించారు. పరీక్ష రాసే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని సౌకర్యాలను కల్పిస్తామని తెలియజేశారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్