కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు కలుగుతుందని, రాబోయే ఎంపీ ఎన్నికల్లో నీలం మధు అఖండ విజయం ఖాయమని దయ్యాల యాదగిరి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో బుదవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎస్సీ సెల్ సీనియర్ నాయకుడు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఫస్ట్ వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి దయ్యాల యాదగిరి మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు అఖండ విజయం ఖాయమని కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు దశలు వారిగా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుతుందని ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని బిఆర్ఎస్ పార్టీ, బిజెపి పార్టీ వారి మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని అన్నారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.




