ప్రాంతీయం

బీజేపీ మండల ఉపాధ్యక్షులుగా ఇద్దరి నియామకం

136 Views

దౌల్తాబాద్ : దౌల్తాబాద్ మండల బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులుగా బొల్లం స్వామి, కనుగుల స్వామిలను ఎంపిక చేశారు. వీరు ఎంపికైనట్లు మంగళవారం దుబ్బాకలో ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు ప్రకటించారు. వారికి శాలువాలు కప్పి అభినందించారు. తమపై నమ్మకం ఉంచి మండల పార్టీ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యేకు బొల్లం స్వామి, కనుగుల స్వామిలు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో పార్టీ అభివృద్ధి కార్యకర్తలకు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కిషన్, ముత్యంపేట సర్పంచ్ బండి రాజు, నాయకులు కుమ్మరి నర్సింలు, భూపాల్ రెడ్డి, ముత్యాల శ్రీనివాస్, రామస్వామి గౌడ్, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *