సబ్బండ వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ గారి లక్ష్యమని మెదక్ పార్లమెంట్ సభ్యులు సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పేర్కొన్నారు.. తొగుట మండలం లోని పెద్ద మాసం పల్లిలో 5 లక్షల తో నిర్మించతల పెట్టిన వడ్డెర సంఘం కమ్యూనిటీ హాల్ కు ఎంపీ గారు భూమి పూజ చేశారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని కులాలు, మతాలవారు సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ గారు ముందుకు సాగుతున్నారన్నారు …తెలంగాణ మోడల్ గా దేశవ్యాప్తంగా అభివృద్ధి సంక్షేమాన్ని తీసుకురావడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించడం ఖాయమన్నారు ..తొగుట మండలంలోని అన్ని గ్రామాల్లో విడతల వారీగా అభివృద్ధి కార్యక్రమాలకు నిదులు కేటాయిస్తామని ఆయన తెలిపారు.. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మెట్టు వరలక్ష్మి స్వామి ఎంపీటీసీ మాష్ఠి సుమలత కనకయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది రాంరెడ్డి ఉప సర్పంచ్ రాజిరెడ్డి తోపాటు వార్డు సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వడ్డెర సంఘం నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు
