ప్రాంతీయం

ఆపార్టీ తెరాష్ట్ర కోఆర్డినేటర్గా డాక్టర్ ప్రవీణ్ కుమార్ ను.. 

222 Views
  ముస్తాబాద్, జనవరి18 (24/7న్యూస్ ప్రతినిధి): రాజాధికార సమితి పార్టీ (టిఆర్ఎస్) తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ గా డాక్టర్ ప్రవీణ్ కుమార్ ను నియమించినట్లు ఆపార్టీ అధ్యక్షడు జై భీమ్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ గ్రామానికి చెందిన డాక్టర్ ప్రవీణ్ కుమార్ కూడెల్లి ఎమ్మార్పీఎస్ రాష్త్ర నాయకులుగా పనిచేశారు. అంతే కాకుండా అనేక సామాజిక సేవా కార్ర్యమాలు నిర్వహిస్తూ నిరంతరం ప్రజల్లో వున్నారు. ఆలిండియా ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్ గా, బహుజన్ టీవీ తెలంగాణా రాష్త్ర కో ఆర్డినేటర్ గా పని చేశారు. ఇలాంటి వ్యక్తిని టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ గా నియమించడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *