ముస్తాబాద్ జనవరి 26, రాజేంద్ర సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయంలో పి.మునీందర్ జాతీయ జెండాను ఆవిష్కరించగా మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్ రావు ఆధ్వర్యంలో ఎంపీడీవో రమాదేవి తన సిబ్బందితో కలిసి జాతీయ పతాకాన్ని ఎగరవేయగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై వెంకటేశ్వర్లు తన సిబ్బందితో జండా ఆవిష్కరించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్, వివేకనంద, కొమురం భీమ్, తెలంగాణతల్లి, దొడ్డి కొమురయ్య, సర్దార్ పాపన్న, సాకలి ఐలమ్మ, విగ్రహాల వద్ద, ప్రాథమిక సహకార బ్యాంకు తో పాటు ప్రభుత్వ విద్యాలయాల్లో, మండలంలోని పలు ప్రైవేట్ పాఠశాలల యందు జెండా పండుగ సందర్భంగా జనగణమన, వందేమాతర గీతం ఆలపిస్తూ ఘనంగా నిర్వహించారు. గ్రామాలలో జాతీయ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించగ కనువిందుగా రెపరెపలాడాయి. ఈ సందర్భంగా మండలంలోని ప్రజా ప్రతినిధులు, నాయకులు, సర్పంచులు, పలు సంఘాల నాయకులు, అధికారులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
