దౌల్తాబాద్ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేశారు. ఈ సందర్బంగా దౌల్తాబాద్ జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న లబ్ధిదారులకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో తన కార్యాలయంలో సోమవారం సీఎం రిలీఫ్ ఫండ్ అందజేశారు. దౌలతాబాద్ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు త్వరలోనే సీఎం రిలీఫ్ ఫండ్ అందజేస్తామని ఆమె పేర్కొన్నారు.
