రాయపోల్. రాయపోల్ మండలంలో ఆదివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంట వాకిళ్లు రంగువల్లులతో నిండిపోయాయి. మహిళలు తెల్లవారుజామునుండే తమ వాకిళ్లలో భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల ప్రదర్శన, పతంగుల ను తెలియజేసే విధంగా రంగువల్లులు వేసుకున్నారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు సంక్రాంతి సంబరాల్లో మునిగితేలారు. మండల పరిధిలోని అనాజిపూర్ గ్రామ శివారులో ఉన్న బయన్న గుండ్ల వద్ద ఎడ్ల బండ్లు ఊరేగించి జాతర నిర్వహించారు. సోమవారం సాయంత్రం గ్రామ సమీపంలోని ఆలయాల చెట్టు ఎడ్లబండ్ల ఊరేగింపు నిర్వహించి, రాత్రి మహిళలు పెద్ద ఎత్తున బోనాల ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి బోనాలు సమర్పించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు దీంతో గ్రామంలో రెండు రోజులపాటు సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుండి బంధువులు భారీగా తరలిరావడంతో గ్రామం జనసంద్రంగా మారింది.ఈ కార్యక్రమం లో గజ్వేల్ రామచంద్రo, ఆర్మీ చంద్రం, తదితరులు పాల్గొన్నారు.
