రక్తదానం మహాదానం అన్ని దానాలలోకెల్లా రక్త దానం చాల గొప్పది. ప్రాణాలు కోల్పోయే స్థితి నుండి ఎంతోమంది ప్రాణాలను రక్షించవచ్చు.రక్తదానం చేయండి ప్రాణదాతలుగా నిలవండని సామాజిక ప్రజాసేవక్రం ఇందుప్రియల్ అంగన్వాడి టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న సుల్తాన ఉమర్ రక్తదానం చేసి ప్రాణాలను కాపాడారు. ఆదివారం ఆర్విఎం ఆస్పత్రిలో జమ్మికుంటకు చెందిన మహిళ చికిత్స పొందుతుండగా అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరం ఉన్నదని ఫోన్ ద్వారా వచ్చిన సమాచారానికి స్పందించి వెంటనే ఆర్విఎం ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్ వెళ్లి రక్తం దానం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఏ ప్రాంతంలోనైనా కులమత బేధాలు లేకుండా ఎవరికైనా సరే అత్యవసర సమయంలో రక్తం అవసరం అనే సమాచారం తెలిస్తే రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలన్నారు. జమ్మికుంటకు చెందిన మహిళ అనారోగ్యంతో బాధపడుతున్న పేషంట్ కి అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరం ఉందని తెలియగానే వెంటనే ఆర్విఎం ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్ కి వెళ్లి రక్తదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. చాలామంది రక్తదానం చేయడం వలన అనారోగ్యానికి గురవుతామని అపోహ పడతారని దీనివల్ల రక్తదానం చేయడానికి ముందుకు రాలేకపోతున్నారు. కానీ వాస్తవానికి రక్తం దానం చేయడం వలన ఎలాంటి అనారోగ్యానికి గురికామన్నారు. మన శరీరంలో ఉండే పాత రక్త కణాలు తొలగిపోయి కొత్త రక్తకణాలు ఉత్పత్తి అవుతాయని వాటి ద్వారా ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటామన్నారు. అత్యవసర సమయంలో రక్తదానం చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఎంతో మంది ప్రాణాలు రక్షించడానికి వీలుంటుందని అలా మన ద్వారా రక్తాన్ని స్వీకరించిన వారు కోలుకొని వారి ముఖములో వ్యక్తం చేసే సంతోషం గొప్ప వరంలాంటిదన్నారు.
