చురకలు ప్రతినిధి బండారి బాల్ రెడ్డి ఎల్లారెడ్డిపేట పిబ్రవరి 14 :
ఎల్లారెడ్డిపేట మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్ష పదవికి ఎల్లారెడ్డిపేట గ్రామ రైతు చర్చా మండలి తరపున గుండాడి వెంకట్ రెడ్డి సోమవారం నామినేషన్ వేశారు , వివిధ గ్రామాల రెడ్డి సంఘం మద్దతు దారులతో కలిసి వెళ్ళి నామినేషన్ వేశారు ,
అనంతరం తన మద్దత్తు దారులను ఉద్దేశించి గుండాడి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ మండల రెడ్డి బంధువులందరికీ అన్ని గ్రామాల రెడ్డి సంఘాల రెడ్డి బంధువులందరూ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు , మీ అందరి సహాయ సహకారాలతో నా పదవి కాల సమయంలో మండల రెడ్డి సంఘ భవనాన్ని పూర్తి చేస్తానని తెలియజేస్తూ
పేద మధ్యతరగతి రెడ్డిలకు సహాయ సహకారాలు అందిస్తానని పేద రెడ్డి విద్యార్థులను చదువులో ముందుకు తీసుకుపోవడానికి సహాయం అందిస్తానని , మండల కేంద్రంలో ప్రతిదినం అందుబాటులో ఉండి ప్రభుత్వ అధికార కార్యాలయం లలో మీకు న్యాయపరమైన సమస్యలను మీ వెన్నంటే ఉండి న్యాయం చేయిస్తానని తెలియజేస్తూ మండల రెడ్డి ఆత్మగౌరవాన్ని కాపాడుతానని తెలియజేస్తూ మీ అందరి మద్దతు తో అధిక మెజార్టీతో గెలిపించాలని
రెడ్డి బంధువులందరిని కోరారు ,