ప్రాంతీయం

తెలంగాణ విద్యాశాఖ నిర్వహించిన 50వ రాష్ట్రస్థాయి విద్య వైజ్ఞానిక గణితపర్యవరణ మరియు ఇన్స్పెక్టర్ అవార్డు మానక్ ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న చందాపూర్ ప్రధాన ఉపాధ్యాయులు గారి పల్లి సిద్దేశ్వర మరియు విద్యార్థిని శరణ్య

125 Views

తెలంగాణ విద్యా శాఖ రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన 50వ రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక గణిత పర్యావరణ మరియు ఇన్స్పైర్ అవార్డ్ మానక్ ప్రదర్శన 2023ను నిర్మల్ జిల్లాలో నిర్వహించారు. ఈ ప్రదర్శన కార్యక్రమంలో గైడ్ ఉపాధ్యాయులుగా తొగుట మండలంలోని UPS చందాపూర్ ప్రధానోపాధ్యాయులు శ్రీ గరిపల్లి సిద్ధేశ్వర్ గారు, 7వ తరగతి విద్యార్థిని శరణ్య పాల్గొన్నారు. వారికి పార్టీసిపెంట్ సర్టిఫికెట్ లను గ్రామ సర్పంచ్ శ్రీ బొడ్డు నర్సింలు గారు వారి చేతుల మీదుగా అందించారు. తొగుట మండలంలో నుండి జిల్లా స్థాయిలో పాల్గొని జిల్లా స్థాయిలో విజేతగా నిలిచి రాష్ట్ర స్థాయిలో పాల్గొనడం గర్వించదగ్గ విషయమని, ముందు ముందు ఇలాంటి మరిన్ని కార్యక్రమంలో పాల్గొని మరిన్ని విజయాలు సాధించి UPS చందాపూర్ పాఠశాల పేరు నిలపాలని, రాష్ట్ర స్థాయిలో పాల్గొనేలా విద్యార్థిని ప్రోత్సహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ గరిపల్లి సిద్ధేశ్వర్ గారిని ప్రశంసించారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల సహోపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్