*సహకార సంఘం బలపేతమే లక్ష్యంగా పని చేద్దాం*
కన్గల్ పీఏసీస్ సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి..
తొగుట: కాన్గల్ సహకార సంఘం బలోపేతమే లక్ష్యంగా సభ్యులందరం కృషి చేయాలని సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి అన్నారు. గురువారం రోజున సహకార సంఘం కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ. దీర్ఘకాలిక రుణలు 15 లక్షలు 15 వెయిల 191 స్వల్పకలిక రుణాలు 8 లక్షల 91 వేయి 106 రూపాయలు రైతుల నుండి రికవరీ చేసినట్టు ఆయన తెలిపారు అలాగే నూతనంగా 42 మంది రైతులకు 29 లక్షల 67 వెయిల రుణాలు నూతనంగా అందించినట్లుగా తెలిపారు. ఖరీఫ్ సీజన్ లో 11 వందల 97 మంది రైతులకు 44 వెయ్యిల 697 .6 క్వింటాళ్లు ధాన్యము కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇందు గాను 9 కోట్లల 20 లక్షల 77 వెయిల 56 రూపాయలు రైతులకు చెల్లించినట్లుగా తెలిపారు. అలాగే రైతులకు ఎరువులు అందుబాటులో ఉన్నాయని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. వైస్ చైర్మన్ కురమ్మ యాదగిరి. సీఈవో గంగారెడ్డి. డైరెక్టర్లు. అల్వాల కృష్ణ గౌడ్. చెప్పాల నారాయణరెడ్డి. పి ఎల్లయ్య. జీడిపల్లి అంజయ్య. శ్రీనివాస్ రెడ్డి. ఎన్నం మైపాల్ రెడ్డి. శ్రీధర్.లింగాల నర్సవ ఇస్తారి తో పాటు తదితరులు పాల్గొన్నారు..
