ప్రాంతీయం

లాభాలు ప్రకటించాలి, సంస్థ బకాయిలు వసూలు చేయాలి

75 Views

మంచిర్యాల జిల్లా, రామకృష్ణాపూర్

*లాభాలు ప్రకటించాలి, సంస్థ బకాయిలు వసూలు చేయాలి*

రామకృష్ణాపూర్ లోని రీజనల్ అనలైటికల్ ల్యాబ్లో సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కెమిస్ట్ భాస్కర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా బ్రాంచ్ అధ్యక్షులు వెంకటస్వామి మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరం లాభాలు తెలుపాలంటూ యాజమాన్యం కు వినతి పత్రాలు ఇస్తున్న ఇప్పటివరకు స్పందించకపోవడం సరైన విధానం కాదని సంస్థకు ఎన్ని లాభాలు వచ్చాయో కార్మికులకు తెలియజేయాలని, ఇంకా గుర్తింపు పత్రం ఇవ్వనందున అన్ని యూనియన్లను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి లాభాల వాటాకై ముఖ్యమంత్రి  వద్దకు యాజమాన్యం తీసుకెళ్లాలని మరియు సంస్థకు రావాల్సిన బకాయిలను వెంటనే ప్రభుత్వం చొరవ చూపి ఇప్పిస్తే సంస్థ మరింత ఆర్థికంగా బలవపేతమయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. వీటితో పాటే పలు పెండింగ్ సమస్యలైనా అలవెన్స్లపై ఐటి మాఫీ సొంతింటి కల వంటి సమస్యలు పెండింగ్లో ఉన్నందున కార్మిక సమస్యలపై అన్ని సంఘాలను ఆహ్వానించి ఈ సమస్యలు పరిష్కరించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్, రమేష్ మరియు ల్యాబ్ కెమిస్ట్లు శాంపిలింగ్ మజ్దూర్ర్లు జనరల్ మజ్దూర్లు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్