ముస్తాబాద్ జనవరి 9, ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల వెంటనే నిర్మాణం చేయాలని విద్యార్థులతో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై రాజీవ్ గాంధీ విగ్రహంవద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు ముస్తాబాద్ మండలాన్ని చిన్నచూపు చూస్తున్నారన్నారు.డిగ్రీ కాలేజ్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చి ఏండ్లు గడుస్తున్నా ఇంతవరకు మంజూరు విషయంలో జాప్యం ఎందుకోసమని ప్రశ్నించారు . గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం ఎన్నో ఉద్యమాలు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. విద్యార్థులతో కలిసి రానున్న రోజుల్లో మండలంలో మంత్రి పర్యటనను అడ్డుకుంటామని తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులుబుర్ర రాములు గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దగారి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి వుచ్చిటి బాల్రెడ్డి. అరుట్ల మహేష్ రెడ్డి, దీటి నర్సింలు, రంజాన్ నరేష్, యాగండ్ల మల్లేష్, కాంగ్రెస్ కార్యకర్తలు ణణ తదితరులు పాల్గొన్నారు.




