సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల నూతన ఎమ్మార్వో గా నియామకం అయిన భాగ్య రేఖ ను సోమవారం సేవా రత్న అవార్డు గ్రహీత మర్కుక్ మండల బిఆర్ఎస్ బీసీ సెల్ అద్యక్షులు మేకల కనకయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో భాగ్యరేఖను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి స్వీట్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో భాగ్యరేఖ మాట్లాడుతూ మర్కుక్ మండలంలో రెవెన్యూ పరంగా ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు అలాగే మేకల కనకయ్య మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి మంచి పేరు తెచ్చుకోవాల ఆకాంక్షి ఎమ్మార్వో భాగ్యరేఖకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు