గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో సోమవారం నాడు చైర్మన్ ఎన్ సి రాజమౌళి కౌన్సిలర్ల తో కలిసి రాష్ట్రస్థాయి కళారత్న అవార్డ్ వచ్చిన సందర్భంగా రామకోటి రామరాజు ని ఘనంగా శాలువతో సత్కరించిన మున్సిపల్ చైర్మన్ .రాజమౌళి ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ రామకోటి రామరాజు గత 30సంవత్సరాల నుండి అనేక రాకలుగా చిత్రాలు వేసి యువతకు ఆదర్శంగా నిలిచాడన్నారు. రాష్ట్రస్థాయిలో మన గజ్వేల్ వాసికి కళారత్న అవార్డ్ రావడం ఆనందంగా ఉందన్నారు. స్వతంత్ర సమరయోధుల చిత్రాలను, మరియు రాష్ట్ర ప్రముఖుల చిత్రాలను చక్కగా వేసి అందరిని అబ్బుర పరిచారు. నవధాన్యల నుండి మొదలుకొని సబ్బుబిళ్ళ వరకు వేలాది చిత్రాలను వేసి కలామతల్లి ముద్దుబిడ్డగా అతనికి అతనే సాటి అని కొనియాడారు. ముందు ముందు మరెన్నో అవార్డులు తెచ్చుకోవాలని గజ్వేల్ కి మంచి పేరు తీసుకు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ జక్కియోద్దీన్, కౌన్సిలర్స్ రహీం, బబ్బురి రజిత, అల్వల బాలేష్, నాయకులు పంబాల శివకుమార్, మామిడి శ్రీధర్, శీర్ల మల్లేశం, కో ఆప్షన్ సభ్యులు ఇస్మాయిల్, గంగిశెట్టి రాజు, షరీఫా ఉమర్. సామాజిక కార్యకర్త సాధక్ పాషా, వినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.