ముస్తాబాద్ (ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి) జనవరి 3, నైజాం అరాచక పాలన నుండి తెలంగాణ ( హైదరాబాద్ సంస్థానం) విముక్తి పొంది, 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ ప్రజలు నిజమైన స్వాతంత్ర్య అమృతోత్సవాలు జరుపుకోవలసిన సమయంలో *చరిత్ర తెలిసిన వారే చరిత్ర సృష్టించ గలుగుతారని* విశ్వసిస్తూ తెలంగాణ ప్రజలకు నిజమైన చరిత్రను తెలియజేయాలనే సదుద్దేశంతో జనవరి 1 నుండి 10 తేది వరకు *జన జాగరణ* కార్యక్రమం నిర్వహించబడును. ఈసందర్భంగా ముస్తాబాద్ మండలం కేంద్రంలో నైజాం స్వాతంత్ర్య అమృతోత్సవాల ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి జిల్లా కార్యదర్శి తోట ధర్మేందర్, మల్లారపు సంతోష్ రెడ్డి, పప్పుల శ్రీకాంత్, కోండ భానుచందర్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
