

దౌల్తాబాద్: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేలా కార్యకర్తలు కృషి చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అన్నారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ వీఆర్ఆర్ గార్డెన్ లో బిజెపి మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 3, 4 తేదీల్లో ఓటర్ నమోదుపై ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండిన యువత తమ ఓటు హక్కును నమోదు చేసుకోని, ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని సూచించారు. బిఎల్వోలతో పాటు బిజెపి కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ఓటర్లను చైతన్యవంతులను చేయాలన్నారు.
దుబ్బాక నియోజకవర్గం లో వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేస్తునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మంగళ యాదగిరి, సర్పంచులు సురేందర్ రెడ్డి, బండి రాజు, మండల పార్టీ అధ్యక్షుడు పోతరాజు కిషన్, నాయకులు స్వామి గౌడ్, గంగాధరి రవీందర్, భూపాల్ రెడ్డి, రామస్వామి గౌడ్, శ్రీనివాస్, నరసింహారెడ్డి, చంటి, అమరేందర్ రెడ్డి, లక్ష్మణ్, అనిల్ రెడ్డి, కనకరాజు, రంజిత్ గౌడ్, నరసింహులు, రమేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.




