ప్రాంతీయం

నూతన సంవత్సర వేడుకలతో భక్తులతో కిటికీడలాడిన మధనానంద శారదా క్షేత్రం

105 Views

నూతన సంవత్సరం సందర్భంగా తొగుట- రాంపూర్ లోని శ్రీ మదనానంద శారదా క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది ..నూతన సంవత్సర సందర్భంగా ఈ క్షేత్రం లో ఏటా స్పటిక లింగేశ్వర స్వామికి అభిషేకాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది..లోకళ్యాణార్ధం ఈ సంవత్సరం 1100 లీటర్ల చెరుకు రసం తో స్పటిక లింగేశ్వర స్వామికి అభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉదయం నుండి పెద్ద ఎత్తున భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయానికి రావడం జరిగింది.. స్పటిక లింగేశ్వర స్వామికి అభిషేక కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ..ఈ సందర్భంగా శ్రీకృష్ణానంద సరస్వతి స్వామి వారి పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు.. పార్వతి పరమేశ్వర స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా సాగింది..శ్రీ రంగంపేట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు.. భక్తులందరూ..సత్వగుణం అలవర్చుకొని..సమాజంలో శాంతి సామరస్యం వెళ్లి విరిసేలా నడుచుకోవాలని స్వామి వారు పేర్కొన్నారు… ఈసందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎం దేవేందర్ రెడ్డి గారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు..స్పటిక లింగేశ్వర స్వామి వారికి..అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు..అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అఖండ భజన, అన్నదానం కార్యక్రమం నిర్వహించారు..

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్