ప్రాంతీయం

రైతు సంక్షేమం కోసం కృషి చేసిన ముత్యంరెడ్డి. కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస రెడ్డి

118 Views

తుక్కాపూర్ లో మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి జయంతి వేడుకలు. ..నిరంతరం రైతుల సంక్షేమం కోసం కృషి చేసిన వ్యక్తి ముత్యం రెడ్డి అని ఆయన తనయుడు కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మాజీ మంత్రి స్వర్గీయ చెరుకు ముత్యం రెడ్డి జయంతి వేడుకలను తుక్కాపూర్ లోగల స్మృతివనం లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ స్వతహాగా ముత్యం రెడ్డి రైతు కాబట్టి రైతులు పడే కష్టాలు తెలుసుకొని వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే నాయకుడుగా వారికి కావాల్సిన ప్రోత్సాహకాలు అందించడానికి ప్రభుత్వం తరుపున సహాయ సహకారాలు అందించారని తెలిపారు. రైతులకు రావాల్సిన సబ్సిడీలను అందించి వ్యవసాయంలో నూతన పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారని కొనియాడారు. నిరంతరం ప్రజల మధ్య ఉంది వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునీ ప్రజా నాయకుడిగా గుర్తింపు తెచ్చుకొన్నారనీ, రైతులకు అండగా ఉన్న నాయకుడు గా నిస్వార్థ ప్రజా నాయకుడిగా సేవలందించారన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని తాను సైతం దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సేవ చేయడానికి సిద్దంగా ఉన్నానని, ముత్యం రెడ్డి ఆశయాలను కొనసాగించడానికి నిరంతం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముత్యం రెడ్డి చూపిన బాటలో నడుస్తానని, రాబోయే రోజుల్లో దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని ధీమా వ్యక్తంచేశారు. అనంతరం మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు బూస నిరంజన్ రెడ్డి ఇటీవల కాలంలో అస్వస్థత కు గురికావడంతో ఆయన ఇంటికి వెళ్ళి శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో తొగుట ఎంపిపి లతా నరేందర్ రెడ్డి, మండల కాంగ్రస్ పార్టీ అధ్యక్షుడు అక్కం స్వామి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు లింగాల కృష్ణ , నాయకులు, ఎస్.కొండల్ రెడ్డి, విజయపాల్ రెడ్డి, కాన్గల్, తుక్కపూర్ గ్రామ పార్టీ అధ్యక్షులు భూపాల్ రెడ్డి, బాల్ రెడ్డి , గణపురం రాజిరెడ్డి, బి.రాజిరెడ్డి, వెంకటస్వామి, బాలమల్లు, మహేష్, భరత్, ఆన్సర్, చెరుకు అజయ్ రెడ్డి, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్