ముస్తాబాద్, మార్చి13 (24/7న్యూస్ ప్రతినిధి) తెర్లుమద్ది గ్రామంలో స్పెషల్ డెవలప్మెంట్ కింద మూడు 3.లక్షల 25వేల రూపాయల, వ్యయంతో ఎస్.సీ కాలనీలోని కమ్యూనిటీ హాల్ భవన ప్రహరీ గోడ నిర్మాణానికి మండల పార్టీ అధ్యక్షుడు ఏళ్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో భూమిపూజకు సహకరించిన జడ్పిటిసి గుండం నరసయ్య, మాజీ సర్పంచ్ కలకొండ కిషన్ రావు, ముస్తాబాద్ ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ముస్తాబాద్ పట్టణ శాఖ అధ్యక్షులు గజ్జలరాజు హాజరై పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెర్లుమద్ది గ్రామశాఖ అధ్యక్షులు మామిళ్ళ శ్రీకాంత్, పుట్ట శ్రీనివాస్, ఉప సర్పంచ్ పుట్ట అశోక్, యూత్ అధ్యక్షులు సాయి గౌడ్, గ్రామ యూత్ అధ్యక్షులు వేణు, అగ్రహారం బాబు, ఈర్ల రాజమల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
