ముస్తాబాద్ డిసెంబర్ 28, మండలంలోని సెవలాల్ తండాకు చెందిన రమావత్ శంకర్ నాయక్ తండ్రి రాజునాయక్ వయసు 32 ఎస్టి లంబాడి కులంకు చెందిన అనునతడు గత కొన్ని రోజులుగా పనిచేస్తూ వచ్చిన డబ్బులతో మద్యానికి బానిసై ఏపని వెళ్లకుండా ఉంటున్నాడు తాగవద్దని భార్య లక్ష్మి చెప్పగా ఆమె మాట వినకుండా ఆమెను కొడుతూ ఇంట్లో నుండి పంపించాడు. మంగళవారం సాయంత్రం 6:30 సమయంలో రమావాస్ శంకర్ నాయక్ జీవితంపై విరక్తి చెంది తన ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
