ప్రాంతీయం

మెనూ ప్రకారం పాటించాలి…

124 Views
*_ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ లకి పక్క భవనాలు నిర్మించాలి_*
*— కంచర్ల రవి గౌడ్ బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్*
ముస్తాబాద్ ప్రతినిధి డిసెంబర్ 29, రాజన్న సిరిసిల్ల జిల్లా బిసి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో స్థానిక బిసి హాస్టల్ ( బాలుర) లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ బిసి హాస్టల్ లకి పక్క భవనాలను వెంటనే ఏర్పాటు చేయాలని అలాగే చలి కాలం తీవ్రంగా ఉన్నందున కూడా ఇంకా దుప్పట్లు పంచడం లేదు అని వెంటనే దుప్పట్లను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులు పొద్దున లేసి కళాశాలకి పోవడంవల్ల చన్నీలతో స్నానాలకు ఇబ్బంది పడాల్సి వస్తుందని హాస్టల్ లో వున్న గ్రిజర్ లను వెంటనే బాగు చేయాలనీ డిమాండ్ చేశారు.అన్ని హాస్టల్ లలో నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు.ఇంతకు ముందు వారంలో రెండు రోజులు గుడ్డు పెట్టేవారని ఇప్పడు ఒక్కరోజు మాత్రమే పెడుతున్నారు అని వెంటనే మెనూ ప్రకారంగా నాణ్యమైన భోజనము అందించాలని, పక్క భవనాలు ఏర్పాటు చెయ్యాలని అలాగే వేడినీటి కోసం గ్రిజార్ లు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు. హాస్టల్ లలో వార్డెన్ లు లేకపోవడం వల్ల ఇబ్బంది పడాల్సి వస్తుందని ఒక్కోవార్డెన్ కి 2నుండి 4 హాస్టల బాధ్యతలు ఇవ్వడం వల్ల ఇక్కడ కూడా సరిగా చూసుకోవడం లేదు అని వెంటనే అన్ని సంక్షేమ హాస్టల్ లో శాశ్వత వార్డెన్ లని నియమించలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్,మండల అధ్యక్షులు మట్టే నరేష్, పట్టణ అధ్యక్షుడు రుద్రవెని సుజిత్ కుమార్, హాస్టల్ ఇంచార్జీ నవీన్,నాయకులు శశాంక్, శివమణి, మనోజ్, క్రాంతి, విజయ్, వినాయక్, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్