కొమురం భీం అసిఫాబాద్ జిల్లా
తేదీ:-22-10-2023
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అంబేద్కర్ చౌక్ నుండి పారా మిలిటరీ దళాల ఫ్లాగ్ మార్చ్ జెండా ఊపి ప్రారంభించిన జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపిఎస్
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి
శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలి
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నవంబర్ 30న జరిగే శాసనసభ ఎన్నికల సందర్భంగా ఎలాంటి వర్గ బేధాలు లేకుండా అల్లర్లు జరుగకుండా ప్రజలంతా సహకరించాలని జిల్లా ఎస్పీ కె సురేష్ కుమార్ ఐపిఎస్ గారు అన్నారు.
ఆసిఫాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద పారా మిలిటరీ దళాల ఫ్లాగ్ మార్చ్ ను జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా పారా మిలిటరీ దళాలతో కలిసి పట్టణంలోని అంబేద్కర్ చౌక్, మజీద్ మహల్లా, బ్రాహ్మణవాడ, కసబ్వాడి, సందీప్ నగర్, వీధుల గుండా కవాతు లో పాల్గొన్నారు.
అనంతరం పారామీటర్ దళాలకు ఎన్నికలకు సంబంధించి తగు సూచనలు చేశారు. ఎస్పీ గారు మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ సూచించిన గైడ్లైన్స్ ప్రకారం విధులు నిర్వహించాలని,రాబోయే శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇప్పటి నుండే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి సాధించడం జరిగిందని అన్నారు . జిల్లా లొ మొత్తం 597 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో నార్మల్ పోలింగ్ కేంద్రాలు 432 మరియు క్రిటికల్ పొలింగ్ 92, పొలింగ్ 73 గా గుర్తించడం జరిగింది అన్నారు.
ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన, గొడవలు సృష్టించాలని చూసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని హెచ్చరించారు. గ్రామంలోని ప్రజలంతా ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడే గ్రామము, జిల్లా అభివృద్ధి చెందుతుందని కావున ప్రజలంతా వర్గ బేధాలు లేకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలని ఒకరికి ఒకరు కలిసి మెలిసి సామరస్యంగా ఉండాలని తెలిపారు. ప్రజలంతా ఎలక్షన్ సమయంలో పోలీసు వారికి సహకరించాలని ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ గారితో పాటు ఆసిఫాబాద్ డిఎస్పి వెంకటరమణ ,సీఐలు రాజు, శ్రీనివాస్, నరేందర్, మల్లేష్, ఎస్ఐ లు , సిబ్బంది పాల్గొన్నారు.






