ముస్తాబాద్ డిసెంబర్ 19, ముస్తాబాద్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మిక యూనియన్ ప్రస్తుత మార్కెట్ లో గుడ్డు ధర 7రూ. ఉండటం వలన వారానికి 3,సార్లు విద్యార్థులకు భోజనంలొ గ్రుడ్లు పెట్టడం మావల్లకాదు అని డీఈవో ఎంఇవొకి ప్రభుత్వ కార్యాలయంలో వినతి పత్రం గతంలోనే అందజేయడం జరిగిందని మధ్యాహ్నం భోజనం తయారుచేసే నిర్వాహకులు మాట్లాడుతూ మాకు ప్రభుత్వం గుడ్డు కి కేవలం 5.రూ.లు చెల్లిస్తుంది. పైనుండి 2రూ, అదనంగా చెల్లించి మేము నష్ట పోతున్నాంమని గుడ్డుధర తగ్గేవరకు పాఠశాలల్లో గ్రుడ్లు పెట్టడం మావల్ల కాదు ఈరోజు కూడా యధావిధిగా వినతిపత్రం సమర్పించామని ఆరోపించారు. ఈవిషయంను ఉపద్యాయులు, విద్యార్థులు పిల్లల తల్లిదండ్రులు మానవీయ కోణంలో ఆలోచంచగలని కోరారు. ఎంఇవొ అధికారులకు వినతి పత్రం అందించిన వారిలో మాపై ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం ఇప్పటికైనా నష్టాల్లో కూరుకు పోతున్నామని మధ్యాహ్న భోజన కార్మిక సంఘం ప్రతినిధులు, అధ్యక్షులు, గొట్టే సంతోష, సభ్యులు, లక్ష్మీ నర్శవ్వ, పర్శ లక్ష్మి, వెంకటవ్వ , బండారి రాజవ్వ, తదితరులు పాల్గొన్నారు.
