Breaking News

జర్నలిస్టులను కాపాడుకుంటాం

207 Views

సమస్యలను వెలుగులోకి తెస్తాం జర్నలిస్టులను కాపాడుకుంటాం

జనవరి 23

జిల్లా సంగారెడ్డి, అందొల్ నియోజకవర్గం,తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫోరం (టి వై జెఎఫ్ )సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్మెడ అనిల్ కుమార్

జిల్లాలోని మారుమూల గ్రామాల నుండి జిల్లా కేంద్రం వరకు ఉన్న వెలుగులోకి రాని సమస్యలను వెలుగులోకి తెచ్చిఆ సమస్యల పరిష్కారానికి దోహదపడతామని చల్మెడ అనిల్ కుమార్ అన్నారు. సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతూ విలేకరుల సంక్షేమానికి ప్రభుత్వం పటిష్ట ప్రణాళికలు రచించి వాటిని సాకారం చేసే విధంగా ముందుకు సాగాలని అన్నారు. సమస్యలు వెలుగులోకి తేవడానికి జర్నలిస్టులు అహర్నిశలు నిష్పక్షపాతంగా కృషి చేస్తారని అన్నారు.

జర్నలిస్టులను చిన్నచూపు చూసిన గత ప్రభుత్వం,ఆ నాయకులు తెరమరుగయ్యారని అందులో జర్నలిస్టుల పాత్ర ప్రధానంగా ఉందని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి సమాచార వ్యవస్థనే అని అన్నారు. ఎక్కడైనా ప్రభుత్వాలకు మార్గ నిర్దేశం చేసేదే జర్నలిజం అని పేర్కొన్నారు.త్వరలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ యూత్ జర్నలిస్టు ఫోరం జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *