నర్సాపూర్; క్రీడలతో మానసిక వికాసంతో పాటు శారీరక దారుడ్యం లభిస్తుందని, విద్యార్థులు చదువులతో పాటు క్రీడలలో ముందుండాలని మెదక్ పార్లమెంట్ సభ్యులు, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పిలుపునిచ్చారు….. దివంగత వాకిటి లక్ష్మారెడ్డి 60 వ స్మారక జయంతి సందర్భంగా నర్సాపూర్ లోని బి.వి.ఆర్.ఐ.టి కళాశాలలో ఏర్పాటు చేసిన వాలీబాల్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ చైర్మన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఎంపీ గారు మాట్లాడుతూ సెల్ఫోన్ రాకతో యువత మొత్తం ప్రభావానికి గురయ్యారని …ఆటలు, పాటలు మర్చిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు… తమ చిన్ననాటి కాలంలో కబడ్డీ, వాలీబాల్ , క్రికెట్, కోకో చిర్రగోనే, చెట్టిరిక తదితర ఆటలు ఆడే వారమని ఆయన గుర్తు చేశారు….సీఎం కేసీఆర్ గారు క్రీడలకు ప్రోత్సాహం అందిస్తున్నారని, గ్రామ గ్రామాన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.. యువత చదువులతోపాటు క్రీడలపై దృష్టి సారించాలని, లేని పక్షంలో ఊబకాయంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు..రోడ్లు ప్రమాదాల్లో 90 శాతం హెల్మెట్ ధరించకపోవడం మూలంగా ప్రాణాలు కోల్పోవాల్సి వొస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు..బైక్ మీద వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ,సెల్ఫోన్లో మాట్లాడొద్దని ఆయన కోరారు..ఈసందర్భంగా కాసేపు ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ చైర్మన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి లతో కలిసి వాలీబాల్ ఆట ఆడుతూ..యువతను ఉత్సాహ పరిచారు..
